ఇది ఒక మిత్రుడు ఎప్పుడో ఒక తెలుగు లఘుచిత్రం కోసం పంపిన ఆంగ్ల సంభాషణకు తెలుగు అనువాదం .....
నువ్వు చనిపోయిన సమయంలో మీ ఇంటికి వెళ్ళే దారిలో ఉన్నావు.
అదొక కారు ప్రమాదం. పెద్దగా చెప్పుకోవలసిన సంగతేం కాదు గానీ ప్రాణాంతకమైన ప్రమాదం, అంతే.
నువ్వు నీ ఇద్దరు పిల్లలను, భార్యను వదిలేసి వచ్చావు. అనాయాస మరణమే నీది. వైద్యులు వాళ్ళ ప్రయత్నం చేశారు గానీ లాభం లేకపోయింది. నీ శరీరం ఎంతగా ఛిద్రమైపోయిందంటే, ఇక బ్రతికినా కూడా ఏ మాత్రం ఉపయోగం లేదంటే నమ్ము!
అదిగో! అప్పుడే, నువ్వు నన్ను కలిసింది.
"ఎ... ఏమయ్యింది?, ఎక్కడున్నాను నేను?" అడిగావు నువ్వు.
"నువ్వు చనిపోయావు." అని నీళ్ళు నమలకుండా ఉన్న విషయం చెప్పాను నేను.
" అక్కడ ఓ... ఒక ట్రక్కు గతితప్పింది...."
"అవును. " చెప్పాను నేను.
"నే... నేను చనిపోయానా?"
"హ్మ్మ్...కానీ అంతగా బాధపడకు. ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు చనిపోవాల్సిందే." నా సమాధానం.
నువ్వు చుట్టూ చూశావు. అంతా శూన్యం. అక్కడ కేవలం నువ్వూ నేను మత్రమే. " ఈ ప్రదేశం ఏమిటి?" నువ్వు అడిగావు. "మరణానంతర జీవితమంటే ఇదేనా?"
"ఒకవిధంగా అంతే." చెప్పాను నేను.
"నువ్వు దేవుడివా?"
"అవును."
"నా భార్యా పిల్లలూ....!", "వాళ్ళ సంగతేంటి?" , "వాళ్ళకేం అవలేదుగా?" గబగబా అడిగావు నువ్వు.
అప్పుడు నేనన్నాను, "నాకు కూడా అదే చూడాలనుంది.", " చూడు, నువ్వు చనిపోయిన వెంటనే నీ మొదటి ఆందోళన నీ కుటుంబం గురించే. మంచి విషయమే సుమీ."
వెంటనే నువ్వు నా వైపు ఆశ్చర్యంతో చూశావు. నీకు నేను దేవుడిలా కనిపించలేదు. బహుశా ఎవరో పురుషుడో లేకపోతే స్త్రీ అనో అనుకుని ఉంటావు. లేదంటే ఎవరో ఒక పెద్దమనిషిలా అనుకుంటా. దేవుడిలా మాత్రం భావించలేదు. బహుశ పాఠశాలలో వ్యాకరణం ఉపాధ్యాయుడిగా భావించావేమో?
"బాధపడకు," చెప్పాను నేను. " నీ కుటుంబం బాగానే ఉంటుంది.నీ పిల్లలు నిన్ను ఒక ఉత్తమమైన నాన్నగానే గుర్తుంచుకుంటారు. వాళ్ళకి నీ పట్ల తృణీకారం పెంచుకోనేంత సమయం లేదు మరి. నీ భార్య బైటకు ఏడ్చినా లోన స్వాంతన పొందుతుంది. నిజం చెప్పాలంటే, నీ వైవాహిక జీవితం పూర్తిగా బీటలువారింది. తను మనసులో స్వాంతన పొందినందుకు నీ భార్య తనని తాను నిందించుకుంటే అది గొప్పే.
"ఓహ్... అయితే ఇప్పుడేమవుతుంది? స్వర్గం, నరకం లేక ఇంకేమైనా?" అడిగావు నువ్వు.
"అవేమి కాదు. నువ్వు మళ్లీ పునర్జన్మ పొందుతావు." చెప్పాను నేను.
"ఏంటీ.... అంటే హిందువులు చెప్పినది నిజమేనన్నమాట."
"ప్రతి మతమూ సరియైనదే. పద అలా నడుద్దాం"
అలా శూన్యంలో నడుస్తుంటే నన్ననుసరించావు.
"మనం ఎక్కడికి వెళ్తున్నాము?"
"ఇదిమిద్దంగా ఫలానా చోటుకి అని కాదు, నడుస్తూ మాట్లాడుతుంటే బాగుంటుంది, అందుకు" చెప్పాను నేను.
"సరే అయితే దీని సంగతేంటి?" అడిగావు నువ్వు. "నేను మళ్ళీ పుట్టినప్పుడు ఒక రాయని పలకలా ఉంటాను కదా? ఒక చిన్న శిశువుగా... ముందు జీవితంలో నా అనుభవాలూ, నేను చేసిన పనులూ, వీటితో మరిక సంబంధం ఉండదు కదా?"
"అలా కాదు. నీ గత జన్మల తాలూకా అనుభవాలన్నీ నీ స్మృతిలో ఉంటాయి. కాకపోతే అవి నువ్వు గుర్తుకు తెచ్చుకోలేవంతే." అన్నాను నేను.
నా నడకను ఆపి నీ భుజాలను పట్టుకుని చెప్పాను "నీలో ఉన్న ఆత్మ నువ్వు ఊహించినదానికన్నా ఎంతో బృహత్తరమైనది, అందమైనది మరియు అనంతమైనది. దీనిని అత్యంత స్వల్ప పరిమాణంలో మత్రమే సాధారణ మనవ మేధస్సు గ్రహించగలుగుతుంది. ఒక పాత్రలోని నీటి వెచ్చదనాన్ని తెలుసుకోవడానికి దాంట్లో నీ వేలిని ముంచుతావు కదా. అలాగే ఆత్మవైన నువ్వు ఈ ప్రపంచంలో ఒక చిన్న రూపంలో ప్రవేశించడం ద్వారా ఈ ప్రపంచం యొక్క అన్ని అనుభవాలను పొందుతావన్నమాట."
"నువ్వు గత 48 సంవత్సారాలుగా మానవ రూపంలోనే ఉండటంచేత నువ్వింకా అనంతమైన నీ ఆత్మ స్వరూపాన్ని ఇంకా గ్రహించలేకపోతున్నావు. కాని ఇక్కడ తగినంత సమయం గడిపితే నీకు క్రమంగా అంతా అవగతమౌతుంది. కాకపోతే ప్రతి జన్మాంతరంలోనూ ఈ వృధా ప్రయాస అర్థరహితం."
"అయితే ఇప్పటివరకు నేనెన్నిసార్లు పుట్టాను?"
"అబ్బో చాలా సార్లు పుట్టావు. రకరకాల జన్మలెత్తావు. అయితే ఈ సారి నువ్వు కీ.పూ. 540 లో చైనా దేశంలో ఒక వ్యవసాయ కుటుంబంలో పాపగా జన్మిస్తావు."
"ఆ... ఏంటి?", "నన్ను మళ్లీ కాలంలో వెనక్కి పంపుతారా?" తత్తరపడుతూ అడిగావు.
"అవును. మీ లోకంలో మీరు అనుభూతి చెందే సమయం మీకు మాత్రమే పరిమితం. మా లోకంలో సమయం ఈ విధంగా ఉండదు."
"నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు?" నీ ప్రశ్న.
"నేను ఒకదగ్గరినుంచి వచ్చాను. అక్కడ నాలాగే చాలామంది ఉంటారు. ఆ ప్రదేశం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని నీకు కుతూహలంగా ఉందని తెలుసు కాని నిజంగా అది నీకు చెప్పినా ఇప్పుడు అర్థంకాదు. " వివరించాను నేను.
"ఓహొ..." కాస్త నిరాశగా నిట్టూర్చావు. "కాని నేను కాలంలో వెనక్కి వెళ్లి కుడా జన్మించగలిగితే ఎక్కడో ఒకచోట నన్ను నేను కలుసుకొనే అవకాసం ఉంది కదా?"
"తప్పకుండా. ఇది నిరంతరమూ జరుగుతూనే ఉంటుంది కుడా. కాకపోతే మీ రెండు జన్మల్లో వాటి లౌకిక జ్ఞానాన్ని మాత్రమే కలిగి ఉండటంచేత మీరు ఈ విషయాన్ని గ్రహించలేరు. "
"అయితే దీని ఉద్దేశం ఏమిటి?"
"నిజంగా?" నేను అడిగాను. "నిజంగానే నువ్వు నన్ను జీవిత పరమార్థం గురించి అడుగుతున్నావా?". "బాగా అరిగిపోయిన ప్రశ్నేమో?"
"ఈ ప్రశ్న హేతుబద్ధమైనదే." రెట్టించావు నువ్వు.
అప్పుడు నీ కళ్ళలోకి చూస్తూ చెప్పాను, "జీవిత పరమార్థం, నేను ఈ విశ్వాన్ని సృష్టించడానికి కారణం, నువ్వు పరిపక్వత చెందాలనే."
"అంటే మనుషులనా నీ అర్థం? మనుషులు పరిపక్వత చెందాలనా?"
"కాదు. నువ్వు మాత్రమే. ఈ మొత్తం విశ్వాన్ని నీకోసమే సృష్టించాను. ప్రతి కొత్త జన్మలో నీ యొక్క అనుభవ పరిధి, పరిపక్వత, జ్ఞానమూ పెరుగుతూ వస్తాయి."
"కేవలం నెనొక్కడినేనా? మిగిలినవారి సంగతేంటి?"
"వేరే ఇంకెవరూ లేరు." "ఈ విశ్వంలో నువ్వూ నేనూ మాత్రమే ఉన్నాం. "
నువ్వు నా వైపు అయోమయంగా చూసావు. "మరైతే భూమిపై ఉన్న మనుషులంతా...."
"అన్నీ నువ్వే. నీ యొక్క వివిధ పునర్జన్మలు. "
"ఆగాగు. అంటే నేను అందరినీనా!?"
"ఆ... ఇప్పుడు దారికొచ్చావ్" మెచ్చుకోలుగా నీ వీపు తడుతూ చెప్పాను.
"ఈ భూమిపై జీవించిన ప్రతీ మనిషినీ నేనేనా?"
"అలాగే ఇకముందు జీవించబోయేవారు కుడా కదా."
"అబ్రహం లింకన్ నేనేనా?"
"జాన్ విల్కీస్ బూత్ కుడా నువ్వే." బదులిచ్చాను నేను.
"నేను హిట్లర్ కూడానా?" కాస్త విస్మయంతో అడిగావు.
"నువ్వు హిట్లర్ చంపిన లక్షల మంది కుడా" చెప్పాను నేను.
"నేను జీసస్ని?"
"నువ్వు అతడ్ని అనుసరించిన ప్రతిఒక్కడివీ."
నువ్వు మూగబోయావు.
అప్పుడు నేను ఇలా కొనసాగించాను, "నువ్వు ఒకరికి హాని తలపెట్టిన ప్రతిసారి నీకు నువ్వే హాని చేసుకుంటున్నావు. నువ్వు ఇతరులపై చూపించే ప్రేమంతా నీపై నువ్వే చూపించుకుంటున్నావు. ఈ విశ్వంలో ప్రతిఒక్కరూ అనుభవించే సుఖదుఃఖాలను నువ్వే అనుభవిస్తున్నావు."
చాలా సేపు అలోచించి," ఎందుకు?'' అని అడిగావు. " ఎందుకు ఇదంతా చేయడం? "
"ఎందుకంటే, ఒకానొక రోజు నువ్వు నాలా పరిణామం చెందుతావు. ఎందుకంటే నీ అంతిమ గమ్యం అదే. నువ్వూ నాలాంటి వాడివే. నువ్వు నా బిడ్డవి."
"ఓహ్...అంటే నేను కుడా దేవుడ్నేనా?"
"కాదు. అప్పుడే కాదు. నువ్వింకా పిండానివే. నువ్వింకా ఎదుగుతున్నావు. ఒకసారి నువ్వు అన్ని మానవ జన్మలనూ అనుభవించిన తరువాత నీకు పుట్టేందుకు తగిన పరిపక్వత వస్తుంది. "
"అంటే ఈ ప్రపంచమంతా...కేవలం... " అని ఆగావు నువ్వు.
"ఒక అండం" పూర్తీ చేశాను నేను. "ఇప్పుడు నీ తరువాతి జీవితంలోకి వెళ్ళే సమయం అయ్యింది."
ఈ విధంగా చెప్పి నిన్ను నీ మార్గంలో పంపించాను.