ఎప్పుడో ఈనాడు వారపత్రికలో ప్రచురించబడింది ఇది. మూలం ఎవరో మరాఠీ రచయితంట. అనువాదం జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి. నవ్వుకోండి.
పెగ్ -1: మందు విషయంలో మాత్రం మనం ఎప్పుడూ రిస్క్ తీసుకోం.
సాయంత్రం ఇంటికి వచ్చేసరికి, మా ఆవిడ వంట చేస్తూంటుంది. వంటింట్లోంచి వంటపాత్రల శబ్దం వినిపిస్తూంటుంది. మనం పిల్లిలా ఇంట్లో దూరతాం. చెక్క బీరువాలోంచి మందు బాటిల్ తీస్తాం. ఫోటోలో తాతగారు నవ్వుతూ చూస్తారు. ఈ చెవిలో సద్దు ఆ చెవిలో పడనివ్వం.
ఎందుకంటే... మనం ఎప్పుడూ రిస్క్ తీసుకోం.
ఎవరూ వాడని బాత్రూం అటకమీంచి గ్లాసందుకుంటాం. లటక్కన పెగ్గేసి చటుక్కున మూతి తుడుచుకుంటాం. గ్లాసు కడిగేసి అటకమీద పెట్టేస్తాం. అఫ్కోర్స్, బాటిల్ కుడా చెక్కబీరువాలో పెట్టేస్తాం.
తాతగారు బోసినవ్వుతో చూస్తారు. వంటింట్లోకి తొంగి చూస్తాను. మా ఆవిడ చపాతీపిండి కలుపుతూంటుంది. ఈ చెవిలో సద్దు ఆ చెవిలో పడనివ్వం.

నేను: శర్మగారమ్మాయి పెళ్ళి సంగతేమైంది?
ఆవిడ: తిన్నగా ఉంటే కదా మంచి సంబంధాలు రావడానికి ?
పెగ్ -2: మనం మళ్ళీ ఇవతలికి వస్తాం. చెక్కబీరువా తలుపు చప్పుడు చేస్తుంది. మనం మాత్రం నిశ్శబ్దంగా బాటిల్ తీస్తాం. లటక్కన పెగ్గేసి చటుక్కున మూతి తుడుచుకుంటాం. బాటిల్ కడిగేసి అటకమీద పెట్టేస్తాం. ఈ చెవిలో సద్దు ఆ చెవిలో పడనివ్వం.
ఎందుకంటే... మనం ఎప్పుడూ రిస్క్ తీసుకోం.
నేను: ఏమిటోయ్, మన శర్మ కూతురు అప్పుడే పెళ్ళీడుకొచ్చేసిoదా?
ఆవిడ: ఇంకా పెళ్లి వయసేమిటి? అడ్డగాడిదలా ముప్ఫైయేళ్ళొస్తుంటే.
నేను: ఓ... ఐసీ!
పెగ్ -3: మనం మళ్ళా చేక్కబీరువాలోoచి చపాతీపిండి తీస్తాం. చెక్క బీరువాలో బాత్రూం ప్రత్యక్షం అవుతుంది. బాటిల్ తీసి అటకలో రెండౌన్సులు పోస్తాం. లటక్కన పెగ్గేసి చటుక్కున మూతి ముడుచుకుంటాం. తాతగారు పడీపడీ నవ్వుతుంటాడు. అగకని పిండిమీద పెట్టేసి, తాతయ్యని కడిగి చెక్కబీరువాలో పెట్టేస్తాం. వంటింట్లోకి తొంగి చూస్తాం. మా ఆవిడ పొయ్యిమీద బాత్రూం పెడుతుంది. ఈ బాటిల్లో సద్దు ఆ బాటిల్లో పడనివ్వం.
ఎందుకంటే... మనం ఎప్పుడూ రిస్క్ తీసుకోం.
నేను: ఏంటే మా శర్మగార్ని గాడిదంటావా, తోలు ఒలిచేస్తాను.
ఆవిడ: ఊరికే గొడవ చెయ్యకుండా వెళ్లి పడుకోండి.
పెగ్ -4: మనం పిండిలోంచి బాటిల్ తీస్తాం. చెక్కబీరువాలోంచి ఓ పెగ్గు కలుపుతాం. బాత్రూం కడిగేసి అటకమీద పెట్టేస్తాం. మా ఆవిడ ఫోటోలోంచి నవ్వుతూ చూస్తుంటే గాంధీ వంట చేస్తుంటాడు. ఈ శర్మ సంగతి ఆ శర్మగాడికి తెలియనివ్వం.
ఎందుకంటే... మనం ఎప్పుడూ రిస్క్ తీసుకోం.
నేను: ఇంతకీ శర్మగాడి పెళ్లి ఆ గాడిదతో అయిందా లేదా?
ఆవిడ: నెత్తిమీద బక్కెట్ నీళ్ళు పోశానంటే... వెళ్ళండి బయటికి.
పెగ్ -5: నేను మళ్ళీ కిచెన్లోకి వెళ్తాను. నిశ్శబ్దంగా అటకమీద కూర్చుంటాను. డ్రాయింగ్రూంలోంచి బాటిళ్ళ శబ్దం వినిపిస్తుంటుంది. నేను లోపలి తొంగి చూస్తే మా ఆవిడ బాత్రూంలో మందేస్తుంటుంది. వెంటనే లటక్కున మూతేసి చటుక్కున పెగ్గు తుడుచుకుంటాం. ఈ గాడిద చప్పుడు ఆ గాడిద చెవిలో పడనివ్వం. అఫ్కోర్స్, తాతయ్య ఎప్పుడూ రిస్క్ తీసుకోడు. శర్మ వంట చెయ్యటం పూర్తయ్యేవరకూ మనం ఫోటోలో కూర్చుని మా ఆవిణ్ణి చూసి నవ్వుతుంటాం.

సమాప్తం